గౌరెల్లి గుట్ట లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గౌరెల్లి గ్రామంలో ఉన్న గౌరెల్లి గుట్ట శ్రీ స్వయంభు స్వర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జరిగే ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు వేలాది సంఖ్యలో హాజరవుతుంటారు. ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాలతో, పుష్పాలతో ఎంతో అద్భుతంగా అలంకరించబడ్డాయి. ఉదయం నుండి ప్రత్యేక పూజలు, హోమాలు, సుప్రభాత సేవ, అర్చనలు నిర్వహించగా, అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఈ వేడుకలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనంతో పాటు కల్యాణోత్సవాన్ని తిలకించి మంత్ర ముగ్ధులయ్యారు. భక్తుల నిత్య సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆలయం పరిసరాల్లో శుభ్రత చర్యలు చేపట్టి, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఈ సందర్భంగా భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ తమ కుటుంబంలో శాంతి, సౌభాగ్యం కలగాలని ప్రార్థించారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments