కుంట్లూరు వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు
రంగారెడ్డి జిల్లా ,అబ్దుల్లాపూర్ మెట్ మండలం,పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోనీ కుంట్లూరు గ్రామం లోని వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు . ఉదయం నుంచే వయోవృద్ధుల సంక్షేమ సంఘం భవనం ఆవరణలో మహిళలకు ఆటపోటీలు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. వయోవృద్ధులు స్వయంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్, బెలూన్ బస్టింగ్ , తాడు ఆట , తదితర వంటి వినోదాత్మక పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు.మాతృ దినోత్సవం ప్రాముఖ్యతను వివరిస్తూ సంఘ సభ్యులు, మహిళా ప్రతినిధులు, గ్రామ పెద్దలు స్టేజీపైకి వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు. తల్లి అనే పదానికి ఉన్న విలువ, తల్లి ప్రేమ గొప్పతనాన్ని వివరిస్తూ ఎమోషనల్ ప్రసంగాలు చేశారు. మాతృభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమాన్ని మాతృభక్తి గీతాలు , సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన చామ విక్రమ్ రెడ్డి, సురభి నరసింహారెడ్డిని సంఘం కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. వారిని శాలువాలతో సత్కరించి, స్మృతిచిహ్నాలను అందజేశారు. వారి సేవాభావాన్ని ప్రశంసిస్తూ పలువురు ప్రసంగించారు.
చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, నాటికలు సభలోని ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. మహిళలు తమ చేతులతో వండిన వంటకాలను పరిచయం చేస్తూ మాతృత్వానికి గౌరవం కలిగించేలా కార్యక్రమం సాగింది.అంతలోనే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మందికి పైగా వయోవృద్ధులు , గ్రామస్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమం అంతటా శాంతియుతమైన, ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంది. మాతృత్వానికి అర్థవంతమైన గౌరవం తెలిపేలా ఈ వేడుకలు సాగాయి. అనంతరం వయోవృద్ధుల సంఘం కమిటీ సభ్యులు మాట్లాడుతూ... ఈ సంక్షేమ సంఘం స్థాపించి 12 సంవత్సరాల అయిందని చామ విక్రమ్ రెడ్డి తల్లి పార్వతమ్మ పేరు సభలు నిర్వహిస్తున్నామని, నేటి వరకు దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని, ఎంతోమంది వయోవృద్ధులకు ఆరోగ్య శిబిరాలు, కుంటివారికి వీల్ చైర్స్, నడవలేని వారికి కర్రలు, కంటి ఆపరేషన్లు, ఎవరైనా చనిపోతే వారికి ఆర్థిక సాయం చేయడం, మనోధైర్యం నింపడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తున్నామని, మహిళలును విహార యాత్రలకు తీసుకువెళ్లడం, ఆర్థిక పరిపుష్టి తేవడానికి పొదుపు సంఘాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అదే విధంగా కుంట్లూరు గ్రామంలో వయోవృద్ధులు సంఖ్య పెరగడం వల్ల సంఘం కార్యాలయం స్థలము చిన్నగా ఉన్నందున వయోవృద్ధులకు సరిపోవడంలేదని, ఎన్నోసార్లు రాజకీయ నాయకులకు, కలెక్టర్లకు విన్నపాలు చేసినా కూడా ప్రభుత్వం, నాయకులు,అధికారులు పట్టించుకోవడంలేదని ,మాకు ఎక్కడైనా ఒక వెయ్యి గజాల స్థలము ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు చామ విక్రమ్ రెడ్డి, అధ్యక్షులు సురభి నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి మాడుగుల అంజయ్య గౌడ్ ,గౌర ఉపాధ్యక్షులు బద్దం రాంరెడ్డి ,పడమటి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు విఎస్. రఘు శ్రీ విశ్వకర్మ ,పల్లె అంజిరెడ్డి, జోర్క బిక్షపతి, కోశాధికారి పడమటి యాదిరెడ్డి, పొదుపు సంఘం అధ్యక్షులు పెద్దటి నరసింహారెడ్డి, సంయుక్త కార్యదర్శిలు శ్రీ పాటి సుదర్శన్ రెడ్డి, బద్దం అంజయ్య గౌడ్, మాడుగుల శ్రీనివాస్ గౌడ్, ఆడిటర్ కావలి మాణిక్యం, గౌరవ సలహాదారులు చామ రంగారెడ్డి ,చామ నరేందర్ రెడ్డి ,చామ వెంకటరెడ్డి, సలహాదారులు చామ శ్రీనివాస్ రెడ్డి, బంగారు లక్ష్మయ్య , జోర్క నరసింహ ముదిరాజ్, వాకిట సుదర్శన్ రెడ్డి, భజన నిర్వాహకులు శీలం కృష్ణయ్య గౌడ్, వాడెపు నరసింహ చారి ,పొదుపు సంఘం గ్రూప్ 1 కెవి. అంకయ్య, పొదుపు సంఘం గ్రూప్-2 చింతకుంట్ల దయాకర్ రెడ్డి, పొదుపు సంఘం ఆడిటర్ వాడెపు నరసింహ చారి ,మహిళలు చామ జగదీశ్వరి, చామ భారతమ్మ, బంగారు లలిత ,గుర్రం శ్యామలమ్మ,, చిల్లోజు బాలమణి, వయోవృద్ధులు, స్థానిక గ్రామస్తులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments