మన్నెగూడలో మహోనియా హాస్పిటల్ ఘనంగా ప్రారంభం
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ రహదారిపై మహోనియా హాస్పటల్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, ఆరుట్ల మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, రాచర్ల వెంకటేష్, కోడూరి రమేష్, శ్రీనివాస్ నాయక్, ప్రజా ప్రతినిధులు, స్థానిక మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు హాజరై హాస్పటల్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్యసేవలు అందుబాటులో ఉండేలా నూతన హాస్పటల్‌లు ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు. ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలకు అత్యవసర సమయంలో త్వరితగతిన వైద్యం అందేలా మహోనియా హాస్పటల్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక యువతికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ, సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. మహోనియా హాస్పటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్లు డాక్టర్ సువర్ణ, డాక్టర్ భాస్కర్ , మాట్లాడుతూ..., హాస్పటల్‌లో 24 గంటలు అత్యవసర సేవలు, జనరల్ మెడిసిన్, ఆర్థో, గైనకాలజీ, పీడియాట్రిక్స్ వంటి విభాగాల్లో సేవలు అందించనున్నట్లు తెలిపారు. అధునాతన టెక్నాలజీ, అనుభవజ్ఞులైన వైద్యుల సహకారంతో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు.సామాన్య ప్రజలకు అందుబాటు ధరలతో, విశ్వసనీయ సేవలతో మహోనియా హాస్పటల్ ప్రజల్లో విశ్వాసం పొందేలా పనిచేస్తుందని తెలిపారు. ప్రజల సహకారంతో ఈ ఆసుపత్రిని ఈ ప్రాంతంలో ప్రముఖ వైద్యసంస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించామని హాస్పటల్ నిర్వాహకులు తెలిపారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments