త్వరలో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపడతాం

దసరా నాటికి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి

త్వరలో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపడతాం

త్వరలో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపడతాం

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు

66 గజాల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలి 

లబ్ధిదారులు ఎవరికీ లంచాలు ఇవ్వొద్దు

పేదల సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

దసరా నాటికి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి

బీఆర్ఎస్ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

823 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల అందజేత

ఇబ్రహీంపట్నం, మే 24 ( నగరనిజం ) : త్వరలో నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. శనివారం ఆదిభట్ల మున్సిపల్ పరిధిలోని బొంగులూర్ ప్రమీదా గార్డెన్ లో ఆదిభట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీలకు చెందిన 823 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి మాట్లాడుతూ... పేదోడి సొంతింటి కల నెరవేరుతుంటే సంతోషంగా ఉందన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అంధించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు విషయంలో ఎవరికి కూడా లంచాలు ఇచ్చే అవసరం లేదని పేర్కొన్నారు. అలాంటిది ఎదైనా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వాళ్ళను క్షమించేధి లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సబ్సిడిపై వంటగ్యాస్ వంటి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకునప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు పోతున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా తమకు ఫోన్ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్యం విడతల వారీగా రూ.5 లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని చెప్పారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 20 వేల ఇళ్లు నిర్మిస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. కేవలం 66 గజాల్లోనే ఇంటి నిర్మాణం ఉండాలన్నారు. లబ్ధిదారులు ఇళ్లను 45 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. మంజూరు పత్రాలు అందుకున్న వారు వెంటనే నిర్మాణం చేపట్టాలని కోరారు. దసరా నాటికి పూర్తి చేసి, గృహ ప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను వెలికి తీస్తున్నామని, త్వరలోనే భూమిలేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని చెప్పారు. అర్హత ఉండి ఇల్లు రానివారికి రెండో విడతలో మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డీసీ నాయక్, ఆర్డీవో అనంత రెడ్డి, కమీషనర్లు బాలకృష్ణ, అమరేందర్ రెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మహిపాల్, మాజీ ఎంపీపీ లక్ష్మీపతి గౌడ్, టీపీసీసీ సభ్యులు కాకుమాను సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News