ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు ప్రతినిధులకు హామీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్
By NAGARA NIJAM
Views: 6
On
ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల అసోసియేషన్ ప్రతినిధులు గురువారం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సచివాలయంలో కలిశారు.తమ సమస్యలను మంత్రికి వివరించిన వారు, హైదరాబాద్ శివారు ప్రాంతాలకు ఒకే పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్కింగ్ సౌకర్యాల కల్పన, ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలో ఆర్టీఏ అధికారులు, మూడు కమిషనరేట్ల ట్రాఫిక్ డీసీపీలతో సమీక్షా సమావేశం నిర్వహించి, సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Tags:
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Latest News
09 May 2025 23:47:37
ఈటల రాజేందర్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో షామీర్ పేట సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కిందపడిపోతూ...