146 మంది లైసెన్స్డ్  సర్వేయర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్

 146 మంది లైసెన్స్డ్  సర్వేయర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలంలో  కొత్తగా నియమితులైన 146 మంది లైసెన్స్డ్  సర్వేయర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, శిక్షణ కార్యక్రమానికి సోమవారం జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్  రెడ్డి  హాజరైనారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ  సర్వేయర్లు మీ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకొని, రేపటి నుండి ప్రారంభం కాకున్న శిక్షణ కార్యక్రమానికి తప్పనిసరిగా హజరు కావాలని సూచించారు. శిక్షణ కార్యక్రమం 52రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, ఈ శిక్షణ పొందిన తరువాత బాధ్యతయుతంగా విధులు నిర్వహించాలని అదనపు కలెక్టరు తెలిపారు. ఈ కార్యక్రమంలో  శామీర్ పేట్ తహశీల్దార్  యాదగిరిరెడ్డి, సర్వే ల్యాండ్రికార్డ్స్ ఎడి శ్రీనివాస్, బలరాం డిప్యూటి ఐఓస్, సత్యమ్మ డియోస్, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్, తహశీల్దార్, వ్యవసాయ AO తో కలిసి షామీర్‌పేట్ మండలం అలియాబాద్లోని వరి కేంద్రాన్ని పరిశీలించారు. అదనపు కలెక్టరు ధాన్యాన్ని పరిశీలించి రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు