అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి 

అధ్యక్షులు కొమ్ము ప్రవీణ్ నేతృత్వంలో

అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి 

మాదిగ అడ్వకేట్ అసోసియేషన్

హైదరాబాద్, జూన్ 25 (నగర నిజం):తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించాలంటూ న్యాయవాదులు రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్‌కు వినతి పత్రం అందజేశారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వానికి, న్యాయానికి ప్రాతినిధ్యం వహించిన మహానాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకుంటూ న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో ఆయన చిత్రాన్ని ప్రదర్శించడం అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇప్పటికే 2025 జూన్ 19న జనరల్ సర్క్యులర్ నంబర్ 02/2025 (DJA/Misc-31/2019) ద్వారా అంబేద్కర్ చిత్రపటాల‌ను రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రదర్శించాలన్న ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలుచేయాలని, హైకోర్టు కోర్ట్ హాళ్లతో పాటు జిల్లా న్యాయస్థానాల కోర్టుల్లోనూ డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.ఈ చర్య ద్వారా న్యాయ వ్యవస్థకు మార్గదర్శకుడైన డాక్టర్ అంబేద్కర్‌కు గౌరవ నివాళి అర్పించగలమని, కోర్ట్ హాళ్లను న్యాయం కొరకు నిలబడే "జస్టిస్ మందిరాలుగా" చూడాలని పేర్కొన్నారు. వినతి కార్యక్రమాల్లో పాల్గొన్నవారు న్యాయవాదులు చాట్ల మధు , ముత్యాల మురళీధర్ , జనార్దన్ గౌడ్, పులి దేవేందర్ రెడ్డి, సురేష్ గౌడ్, కోండ్రోన్ పల్లి గిరిబాబు, సైదులు, కాట్రావత్ దేవేందర్ నాయక్, హనుమంత్, ఎం కౌశిక్, సందీప్ రెడ్డి, గ్యార గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...
నేటి నుంచే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ
కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి