పలు గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు

పలు గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు

మేడ్చల్ :- మేడ్చల్ మండలం వ్యవసాయ కార్యాలయ పరిధిలోని కండ్లకోయ, బండమాదారం, ఎల్లంపేట్, ఘన్‌పూర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేతాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.ఆచార్య జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు రైతుల వద్దకు వచ్చి పలు సూచనలు చేయడం జరిగింది. రైతులతో  యాజమాన్య పద్ధతులు, ఎరువులు అధిక మోతాదులో వినియోగిస్తే కలిగే నష్టాలు, వరిలో నూతన, అధిక దిగుబడి, సాధించే రకాలు, పచ్చి రొట్టె ఎరువుల వాడకం, జీవన ఎరువులు విత్తనానికి పట్టించి  విత్తనానికి సంబంధించిన ట్రీట్మెంట్ ను డెమో ద్వారా చూపించడం జరిగింది.  డా.వసంత, డా.పుష్పవల్లి, డా.స్వర్ణలత, డా.వరప్రసాద్ పాల్గొన్నారు.వ్యవసాయ అధికారిణి అర్చన, ఏఈవోలు సుమిత, తేజస్విని తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News