ఏసీబీకీ చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణ

రూ.12 లక్షలు డిమాండ్ రూ.9 లక్షలకు ఒప్పందం

ఏసీబీకీ చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణ

ఏసీబీకి చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణ

పట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
 
ఓ వ్యక్తి భూమి సవరించేందుకు లంచం డిమాండ్

రూ.12 లక్షలు డిమాండ్ రూ.9 లక్షలకు ఒప్పందం..

ఆర్ఐ కృష్ణ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

ఇబ్రహీంపట్నం, మే 28 ( నగరనిజం ) : పాసు పుస్తకాల్లో 7 గుంటల భూమిని సవరించేందుకు లంచం డిమాండ్ చేసిన ఇబ్రహీంపట్నం రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గౌర కృష్ణ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం సుమారు మూడు గంటల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం ఆర్ఐ కృష్ణ లంచం డిమాండ్ చేసినట్లు నిరూపితమవడంతో ఆయన్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆర్ఐ కృష్ణపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిభట్ల రెవెన్యూ 355 సర్వే నెంబర్ లో భూమి పట్టా పాసు పుస్తకాల్లో ఏడు గుంటలు తక్కువగా పడింది. దీనిని సవరించేందుకు గానూ సదరు రైతు ఆన్లైన్లో అప్లై చేసుకుని ఇబ్రహీంపట్నం ఆర్ఐ ని సంప్రదించగా, పాసుపుస్తకాలు సవరించేందుకు రూ. 12 లక్షలు లంచం డిమాండ్ చేశారు. రూ. 9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, తన పైఅధికారులకు సైతం లంచం ఇవ్వాల్సి ఉంటుందని అప్పుడే 7 గుంటల భూమి జోడించడం వీలవుతుందని ఆర్ఐ కృష్ణ సదరు వ్యక్తికి తెలిపాడు. మొదటగా రూ.4 లక్షలు ఇవ్వాలని, పని అయిన తర్వాత మిగతా మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా అవినీతినిరోధక శాఖ అధికారులు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఆర్ఐ కృష్ణ ఉద్దేశపూర్వకంగానే భూమిని జోడించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు తేలడంతో ఆయన్ను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఏసీబీ కోర్టులో హజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు