సైబరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
252 మంది వాహనదారులు పట్టివేత
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక మద్యం మోతాదులో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో 252 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిలో 199 మంది ద్విచక్ర వాహనదారులు, 10 మంది మూడు చక్రాల వాహనదారులు, 43 మంది నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు. పట్టుబడినవారిలో 228 మంది మద్యం మోతాదు 35 మిల్లీ గ్రాములు /100 మిల్లీ లీటర్ల నుండి 200 మిల్లీ గ్రాములు /100 మిల్లీ లీటర్ల వరకు ఉండగా, 18 మంది మద్యం మోతాదు 201 మిల్లీ గ్రాములు /100 మిల్లీ లీటర్ల నుండి 300 మిల్లీ గ్రాములు /100 మిల్లీ లీటర్ల వరకు ఉంది. అలాగే 6 మందికి 301 మిల్లీ గ్రాములు /100 మిల్లీ లీటర్ల నుండి 500 మిల్లీ గ్రాములు /100 మిల్లీ లీటర్ల వరకు మద్యం మోతాదు ఉన్నట్లు గుర్తించారు.పట్టుబడిన ప్రతి ఒక్కరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణనష్టానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత–2023 ప్రకారం 105వ విభాగం కింద కేసు నమోదు చేయబడుతుంది. దీనికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తారు.వాహనదారులు మద్యం మత్తులో వాహనం నడపరాదని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని పోలీసులు హెచ్చరించారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments