అబ్దుల్లాపూర్మెట్ బీజేవైఎం మండల అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ
అధిష్టానం అంకుష్ ముదిరాజ్ వైపు మొగ్గు...?
అబ్దుల్లాపూర్మెట్ మండలంలో బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి కోసం బీజేపీ, బీజేవైఎం యువనేతలు మధ్య విశేష ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అంకుష్ ముదిరాజ్ ను ఎంపిక చేయాలన్న వాదనలు బీజేపీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆయనకు స్థానికంగా గల ప్రజాదరణ, యువతతో ఉన్న సాన్నిహిత్యం, మోడీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సామర్థ్యం అధిష్టానం దృష్టిలో కీలకంగా మారాయి.
అంకుష్ ముదిరాజ్ యువతలో ప్రత్యేక గుర్తింపు సాధించారని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని పలువురు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీకి స్థానిక స్థాయిలో మరింత బలపడే అవకాశం ఉందని అనేక వర్గాల భావన. మరోవైపు, ఈ పదవి కోసం మరికొంత మంది యువనాయకులు కూడా ఆసక్తి కనబరిచినప్పటికీ, అధిష్టానం అంకుష్ ముదిరాజ్ పైనే దృష్టి సారించిందని సమాచారం.
మొత్తంగా, అబ్దుల్లాపూర్‌మెట్ మండల బీజేవైఎం అధ్యక్ష పదవిని మరింత ఉత్కంఠతరం అవుతున్నాయి. పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే నిర్ణయం తీసుకోనుండగా, అంకుష్ ముదిరాజ్ పేరు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments