‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’

అవార్డుకు ఎంపికైన పి.వెంకట్ రెడ్డి

‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది  ఇయర్‌ - 2025’’

హైదరాబాద్‌, జూన్‌ 11, (నగర నిజం): హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో ఈనెల 14న నిర్వహించనున్న ‘‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’ కార్యక్రమంలో పునరుత్పాదక శక్తి రంగంలో విశేష కృషి చేసిన పి. వెంకట్‌ రెడ్డి కి ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది  ఇయర్‌ - 2025’’ అవార్డు అందుకోబోతున్నారని నిర్వాహకులు తెలిపారు.‘‘ఇండియన్‌ ఐకానిక్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ పయనీర్ - 2025’’ కేటగిరీలో ఆయనను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని విస్తరించేందుకు వెంకట్‌ రెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.ఈ సందర్భంగా స్పందించిన వెంకట్‌ రెడ్డి, ‘‘ఈ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది నా పరిశ్రమలో సాగిన ప్రయాణానికి గౌరవ సూచకంగా భావిస్తున్నాను. ఇది మరింత బాధ్యతతో ముందుకెళ్లేందుకు ప్రోత్సాహమిస్తుంది’’ అని అన్నారు.పలు విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి ఇండియన్‌ ఐకాన్‌ అవార్డులు ప్రతి ఏడాది ప్రదానం చేయడం ఆనవాయితీగా  కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు