రోడ్డు వేయడం మర్చిపోయారు...?

రోడ్డు వేయడం మర్చిపోయారు...?

InShot_20250620_101740869మనసురాబాద్, జూన్ 20 (నగర నిజం): హయత్ నగర్ సమీపంలోని మనసురాబాద్ డివిజన్ పరిధిలోని విజయనగర్ కాలనీ వాసులు సిసి రోడ్డుల నిర్మాణ పనుల ఆలస్యంతో తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. కమాన్  వైపు నుంచి లోపలికి వెళ్లే ప్రధాన రహదారి వరకు సిసి రోడ్డు వేసేందుకు సంబంధిత శాఖ సుమారు 15 రోజుల క్రితమే సిమెంట్, ఇతర నిర్మాణ మెటీరియల్‌ను తేవడంతో పనులు ప్రారంభమవుతాయనే ఊహతో స్థానికులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంతో రహదారి పూర్తిగా అర్థాంతరంగా మిగిలిపోవడం, వర్షపు నీరు నిలవడం, దుమ్ము, చెత్తతో తీవ్ర అసౌకర్యాలు ఏర్పడుతున్నాయి.

చిన్న చిన్న వాహనాలు పోవడానికి కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితిలో, కాలనీలో పిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు రావడానికి కూడా తటస్థ పడుతున్నారు. వర్షాకాలం దృష్ట్యా పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలనీవాసులు తల్లడిల్లిపోతున్నారని, కనీసం ప్రజల దైనందిన జీవనానికి అవసరమైన రోడ్డు వంటి మౌలిక సదుపాయాలపై అధికారులు శ్రద్ధ చూపాలని వారు కోరుతున్నారు.ఈ మేరకు పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో కాలనీవాసులు ఇప్పుడు రోడ్డుకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. పనులను తక్షణమే పూర్తి చేసి స్థానికులకు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు