ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్
నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సుధా రెడ్డి అనే అధికారి, ఓ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం రూ.8,000 లంచం డిమాండ్ చేసినట్టు అధికారికంగా వెల్లడించారు.లంచం డిమాండ్ చేసిన బాధితుడి ఫిర్యాదుతో సదరు అధికారిపై నాంపల్లిలోని గగన్ విహార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అదే సమయంలో సుధా రెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు పూర్తి విచారణ చేపట్టినట్టు తెలిపారు. మరిన్ని వివరాలు వెల్లడించాల్సి
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments