400 గజాలలో అక్రమ షెడ్డు నిర్మాణం ఎస్ జి పెయింట్స్ అక్రమం

400 గజాలలో అక్రమ షెడ్డు నిర్మాణం ఎస్ జి పెయింట్స్ అక్రమం

మేడ్చల్ పురపాలక సంఘం ఆదాయానికి భారీగా గండి కొడుతున్న పట్టించుకోవాల్సిన మేడ్చల్ పురపాలక సంఘం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు నిద్రమత్తులో జోగుతున్నారని మేడ్చల్ పురపాలక సంఘం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదోడు వెయ్యి రూపాయలు పన్ను కట్టకపోతే ఇబ్బందులు పెట్టే మున్సిపల్ అధికారులు 400 గజాలలో అక్రమ షెడ్డు నిర్మించి ట్రెడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న పట్టించుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పడుతుంది. ఇందుకు ఉదాహరణ మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని గిర్మాపూర్ సర్వేనెంబర్ 1073లో అక్రమంగా నిర్మించి ఎస్ జి పెయింట్స్ తో వ్యాపారం సాగిస్తున్నారు. 

 అనుమతులు లేకుండానే వ్యాపారం :

 మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని సర్వేనెంబర్ 1073లో ఎస్జీ పెయింట్స్ పేరుతో నిర్మించిన చిన్నపాటి గోడౌన్ డొమెస్టిక్ ఇంటి నెంబర్ తీసుకొని కమర్షియల్ వ్యాపారం సాగిస్తున్నారు. ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ పరిశ్రమకు ఎలాంటి ట్రెడ్ లైన్స్ లేకుండానే కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. 

 ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి

అక్రమంగా షెడ్డు నిర్మాణం చేపట్టి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న పట్టించుకోవాల్సిన సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు స్పందించకపోవడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి సదరునిర్మానంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News