మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్‌.. రోడ్డుపై వృధాగా పోతున్న నీరు

మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్‌.. రోడ్డుపై వృధాగా పోతున్న నీరు

ఎల్లంపేట మున్సిపాలిటీ జూన్ 29:- మిషన్ భగీరథ పైప్ లైన్ కు బొక్క పడింది. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహర్తించడంతో మిషన్‌ భగీరథ తాగునీరు వృధాగా పోతున్న సంఘటన ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి లోని మైసిరెడ్డిపల్లి లో వెలుగు చూసింది. మిషన్ భగీరథ పైప్ లైన్ కు బొక్క పడింది. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహర్తించడంతో మిషన్‌ భగీరథ తాగునీరు వృధాగా పోతున్న సంఘటన మైసిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది స్వ

చ్ఛమైన మిషన్ భగీరథ తాగునీరు రోడ్డుపై వరదలా ప్రవహిస్తున్నా ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పైప్ లైన్ కు పడిన రంధ్రం గుండా గ్రామానికి సంబంధించిన డ్రైనేజ్ పైపులోకి వెళుతుందని ఈ కలుషితమైన నీటిని తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యాలకు గురవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బొక్క పడిన మిషన్ భగీరథ మంచినీటి పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

 చర్యలు చేపడతాం మున్సిపల్ కమిషనర్ :నిత్యానంద

సోషల్ మీడియా పరంగా వచ్చిన ఫిర్యాదు కు స్పందించిన ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ నిత్యానంద రేపటిలోగా మిషన్ భగీరథ మంచినీటి పైప్ లైన్ కు మరమ్మతులు చేయించాలని మిషన్ భగీరథ ఏ ఈ కి మైసిరెడ్డి పల్లి వార్డ్ ఆఫీసర్ రమణారెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు