వెన్నెల ఫౌండేషన్ సమ్మర్ క్యాంపులో ' మధర్స్ డే ' వేడుకలు
పాల్గొన్న వెన్నెల ఫౌండేషన్ సభ్యులు, అమ్మలు
ఇబ్రహీంపట్నం, మే 11 ( నగరనిజం ) : ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీట్ లో కొనసాగుతున్న వెన్నెల ఫౌండేషన్ సమ్మర్ క్యాంపులో ఆదివారం మదర్స్ డే వేడుకలు వెన్నెల ఫౌండేషన్ చైర్మన్ ఆనంగారి భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మదర్స్ డేను పురస్కరించుకొని అమ్మ యొక్క గొప్పతనాన్ని కేక్ కట్ చేసి స్వీట్ల రూపంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా వెన్నెల ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ... జన్మజన్మల పేగుబందం, వెలకట్టలేని ప్రేమానుబంధం, తల్లి,బిడ్డల ఆత్మీయ అనుబంధమే మాతృ దినోత్సవం అన్నారు. సమాజంలో కల్మషం లేనిది కేవలం అమ్మ ప్రేమ ఒక్కటేనని అన్నారు. నిస్వార్థ ప్రేమకు నిదర్శనం అమ్మ అని అన్నారు. ఆపదలో అండగా నిలిచే కొండంత ధైర్యం అమ్మ అని అన్నారు. బిడ్డల సంతోషాల్లో తమ సంతోషాన్ని వెతుక్కునే మాతృమూర్తి అమ్మ అని చెప్పారు. ఆప్యాయతను, అనురాగలను పంచేది కేవలం అమ్మ ప్రేమ ఒక్కటేనని అన్నారు. సమస్త సృష్టికి ప్రతిరూపం.. మానవ జన్మకు మణిరూపం అమ్మ అన్నారు. ఎన్ని యుగాలు మారినా.. ఎన్ని తరాలు దాటినా మారని మాధుర్యం అమ్మ ప్రేమ అని అన్నారు. అమ్మ ప్రేమ వెలకట్టలేనిధని పేర్కొన్నారు. అనంతరం మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలని సూచించారు. అనంతరం పిల్లలు చేపట్టిన సాంస్కృతి కార్యక్రమాలు తల్లులను ఆకట్టుకున్నాయి. మాతృ దినోత్సవ వేడుకల్లో అమ్మలు, వెన్నెల ఫౌండేషన్ సభ్యులు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Your Comment


Comments