తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (TPDPMA) సమ్మె విరమణ
మహాత్మా గాంధీ యూనివర్శిటీ పరిధిలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న దరిపల్లి ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (TPDPMA) గత 40 రోజులుగా చేపట్టిన పరీక్షల బహిష్కరణను ఈ రోజు విరమించింది.ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సమస్యలను ముఖ్యమంత్రికి వివరించగా, ముఖ్యమంత్రి డిగ్రీ కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై అన్ని యూనివర్శిటీలు, రాష్ట్ర కమిటీలతో చర్చించి, స్వయంగా బాధ్యత తీసుకున్న బాలకిష్టా రెడ్డి హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించినట్టు TPDPMA ప్రకటించింది. త్వరలోనే అన్ని యూనివర్శిటీల పరిధిలో పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపింది.ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల జాప్యం వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించిందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ చేసిన కృషికి ప్రభుత్వానికి మరియు ఆయనకు సంఘం ధన్యవాదాలు తెలిపింది.విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని బాధ్యతతో సమ్మె విరమించామని, భవన యజమానులు, అధ్యాపకులు సహృదయంగా సహకరించాలని బాలకిష్టా రెడ్డి కోరారు. నిధుల మంజూరు బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని ఆయన తెలిపారు.గత ఆరు నెలలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై నిరంతరం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, నిధుల విడుదలలో కీలకపాత్ర పోషించిన బాలకిష్టా రెడ్డికి తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments