మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసిన చెలిమండ్ల గోవర్ధన్

దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం

మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసిన చెలిమండ్ల గోవర్ధన్

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం అందజేస్తున్న దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెలిమండ్ల గోవర్ధన్

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆయన నివాసంలో దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెలిమండ్ల గోవర్ధన్ కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన మంత్రిని కోరారు.గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం, గత 15 సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లా కొండాపూర్, వనస్థలిపురం ఏరియా హాస్పిటళ్లలో వికలాంగుల సదరం క్యాంపులు నిర్వహించేవి. అయితే, ప్రభుత్వం యూ.డి.ఐ.డి కార్డు అందించనుందని ఐదు నెలల క్రితమే ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి క్యాంపులు నిర్వహించకపోవడంతో వికలాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ఇకపోతే, కొండాపూర్ హాస్పిటల్‌ను తొలగించి గాంధీ హాస్పిటల్‌ను అందులో చేర్చడం వల్ల జిల్లాలోని చేవెళ్ల, చౌదర్ గూడా, ఫరూక్ నగర్, కేశంపేట, షాద్నగర్, శంషాబాద్, శంకర్ పల్లి, షాబాద్, రాజేంద్రనగర్ మండలాల వికలాంగులు దూరమైన గాంధీ హాస్పిటల్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోందని గోవర్ధన్ తెలిపారు.ఈ నేపథ్యంలో గాంధీ హాస్పిటల్‌ను తొలగించి, గతంలా కొండాపూర్ హాస్పిటల్‌నే క్యాంపుల నిర్వహణ కేంద్రంగా కొనసాగించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలంటూ గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్ వి ఎస్ జిల్లా అధ్యక్షులు నరసింహ చారి, సురేష్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News