మీర్పేట్, హయత్ నగర్ పోలీసుల విజయం

 మూడు గొలుసు దొంగతనాలు, రోబరీ కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్ట్

27.7 గ్రాముల బంగారు పుస్తెలతాడు, రెండు బైకులు స్వాధీనం

ఎల్.బి.నగర్ జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్, హయత్ నగర్ పోలీసులు మరియు సీసీఎస్ ఎల్.బి.నగర్ బృందం సంయుక్తంగా వ్యవహరించి మూడు గొలుసు దొంగతనాలు/రోబరీ కేసుల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 27.7 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ.4 లక్షలు ఉంటుంది.

మీర్పేట్ కేసు వివరాలు:

నిందితుడు : కందనులు మల్లేశ్ @ గూడ్లనర్వ మల్లేశ్ (28), వృత్తి : సెంటరింగ్ వర్కర్, గ్రామం : గూడ్లనర్వ, బిజినపల్లి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా.
స్వాధీనం:

  • 20 గ్రాముల బంగారు పుస్తెలతాడు

  • హోండా ఎస్‌ఎఫ్-125 బైకు

కేసు వివరాలు:
జూలై 9న మధ్యాహ్నం 12:10 గంటల ప్రాంతంలో వందన్‌పురి కాలనీకి చెందిన చెవుల సంధ్య అనే మహిళా నివాసానికి నిందితుడు వచ్చినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట అద్దె గదుల కోసం అడిగి, అనంతరం ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. (క్రైం నం: 884/2025, సెక్షన్ 309(4), 305 బీఎన్ఎస్)

హయత్ నగర్ కేసు వివరాలు:

నిందితులు:

  1. రసాల శ్రీరాం (26), అమరావతి లికర్ మార్ట్ లో పనిచేస్తున్నాడు

  2. తిప్పరాజు అర్జున్ (24), ఆటో డ్రైవర్
    ఇద్దరూ హైదరాబాద్‌ లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందినవారు.

స్వాధీనం:

  • 7.7 గ్రాముల బంగారు ఆభరణాలు (15 బీడ్లు, ఒక చింతపండు ఆకారపు లాకెట్)

  • సుజుకి అవెనిస్ 125 స్కూటర్

కేసు వివరాలు:
జూలై 8న సాయంత్రం 7:00 నుంచి 7:15 మధ్య హనుమాన్ నగర్ కాలనీ నుంచి స్వగ్రుహ కాలనీ వెంచర్‌కి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న పద్మ నర్సమ్మ (70) అనే వృద్ధ మహిళ మెడ నుంచి పుసల తాడు గొలుసును ఇద్దరు నిందితులు లాక్కొని స్కూటరుపై పరారయ్యారు. (క్రైం నం: 986/2025, సెక్షన్ 304(2) బీఎన్ఎస్)ఈ అరెస్టులు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ జి. సుధీర్ బాబు ఐపీఎస్ పర్యవేక్షణలో, ఎల్.బి.నగర్ డీసీపీ శ్రీ చి. ప్రవీణ్ కుమార్, రాచకొండ క్రైమ్స్ డీసీపీ శ్రీ వి. అరవింద్ బాబు, ఎడిషనల్ డీసీపీ బి. కోటేశ్వరరావు, ఏసీపీ వనస్థలిపురం డివిజన్ శ్రీ పి. కాశిరెడ్డి మరియు సంబంధిత పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, క్రైం టీంల సమిష్టి కృషితో చేపట్టిన సంఘటిత ఆపరేషన్‌లో భాగంగా జరిగింది.ఈ మంచి పని చేసిన మీర్పేట్, హయత్ నగర్ పోలీసులు మరియు సీసీఎస్ ఎల్.బి.నగర్ బృందాలను ఉన్నతాధికారులు ప్రశంసిస్తూ తగిన నష్టపరిహారం అందించనున్నట్లు డీసీపీ ఎల్.బి.నగర్ జోన్ తెలిపారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు