మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం

ముఖ్యఅతిథి గా జీవీపీఎల్ సీఈఓ రాజశేఖర్ మంచి హాజరయ్యారు

మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం

మేడ్చల్ :-బ్రాండ్ అంబాసిడర్, వైశ్యరత్న, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఆర్యవైశ్య సమావేశాన్ని పట్టణ పరిధిలోని ఓ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీబిఎల్ సీఈఓ రాజశేఖర్ మంచి, జీవీబిఎల్ మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్య వైశ్యులను వ్యాపార రంగాల్లో ఇంకా అభివృద్ధి చేసేందుకు కొంపల్లి, అల్వాల్, మేడ్చల్ ప్రాంతాల్లోని ఆర్యవైశ్యులను ఒక తాటి పైకి తీసుకొచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేసిన లింగా కృష్ణమూర్తి ని అభినం దించారు. మేడ్చల్ ప్రాంతంలో మంత్ర పేరుతో 15 రోజుల్లో ఒక చాప్టర్ ని ఏర్పాటు చేస్తామని, 2026 వరకు 2000 వేల మందితో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 30 చాప్టర్ లను తయారు చేసి మరింత వ్యాపారాల్లో ఆర్యవైశ్యులను ప్రోత్సాహించడమే జీవీబిల్ లక్ష్యమని అన్నారు. అనంతరం లింగా కృష్ణమూర్తి ని శాలువతో సన్మానించారు. పిలవగానే అందరు వచ్చి సమావేశాన్ని విజయ వంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి లింగా కృష్ణమూర్తి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తడిశెట్టి క్రాంతి కుమార్, బజ్జురి సంతోష్, కరీంనగర్ చాప్టర్ కి చెందిన రచమల్ల ప్రసాద్ లతో పాటు మేడ్చల్, కొంపల్లి అల్వాల్ ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్య వ్యాపారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు