బీజేపీ నాయకులతో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సమావేశం

రాష్ట్రంలో బిజెపి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం:- రామచంద్ర రావు

బీజేపీ నాయకులతో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సమావేశం

మేడ్చల్:-తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి, బీజేపీ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన మెదక్ జిల్లా పర్యటనకు వెళ్లారు ఈ పర్యటనలో భాగంగా, మార్గమధ్యంలో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శుభం హోటల్‌లో బీజేపీ కార్యకర్తలతో రామచందర్ రావు సమావేశమయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్,రాష్ట్ర నాయకులు పట్లోల్ల విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు అంకురార్పణ చేద్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని మరింత పెంచవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు శైలజ హరినాథ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు సముద్రాల హంసరాణి కృష్ణ గౌడ్, దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి అధ్యక్షులు కావేరీ శ్రీధర్, సీనియర్ నాయకులు తిరుమల్ రెడ్డి, అమరం మోహన్ రెడ్డి, గౌరారం జగన్ గౌడ్, పాతూరి ప్రభాకర్ రెడ్డి, అర్జున్ బాబు, లవంగ శ్రీకాంత్, మహేష్, హరిబాబు రెడ్డి, వంశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రామచందర్ రావు బిజెపి పార్టీ నాయకులకు సూచించారు.

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...
నేటి నుంచే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ
కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి