కండ్ల కొయ్య ఆక్సిజన్ పార్క్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం

ప్రమాదంలో ఇద్దరు మరణం

కండ్ల కొయ్య ఆక్సిజన్ పార్క్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం

మేడ్చల్ సెప్టెంబర్ 16 (నగర నిజం) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ్య ఆక్సిజన్ పార్కు ముందు మంగళవారం రోజు మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ప్రమాదానికి సంబంధించిన వివరాలు మేడ్చల్ మెడిసిటీ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఇస్లావత్ అనూష(20) తన స్నేహితుడు మహేశ్వర్ రెడ్డితో కలిసి ఫ్యాషన్ బైక్ (ఏపీ 28 సి.హెచ్ 9386) నెంబర్ గల వాహనంపై ప్రయత్నిస్తుండగా ఆక్సిజన్ పార్క్ బస్ స్టాప్ సమీపంలో వెనక నుండి వేగంగా వస్తున్న లారీ నెంబర్ (ఎంపీ 28 హెచ్ 3645) ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అనూష లారీ కింద పడిపోయింది. అనుష అక్కడికక్కడే మృతిచెందగా. తీవ్ర గాయాల పాలైన మహేశ్వర్ రెడ్డిని చికిత్స కోసం మేడ్చల్ పట్టణంలోని సంప్రద ఆస్పత్రి కి తరలించారు చికిత్స పొందుతూ మహేశ్వర్ రెడ్డి సైతం ప్రాణాలు కోల్పోయాడు ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు లారీని నిర్లక్ష్యంగా ప్రమాదంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని ఇట్టి విషయంలో మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అనూష వరంగల్ వాసిగా గుర్తించారు మహేశ్వర్ రెడ్డి కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...
నేటి నుంచే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ
కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి