డబిల్ పూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని పదిమంది విద్యార్థులకు నగదు బహుమతి
లక్షన్నర రూపాయలు నగదు అందజేసిన :-వీర్లపల్లి రాజమల్లారెడ్డి
మేడ్చల్ :-విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డబిల్ పూర్ గ్రామ మాజీ సర్పంచ్ వీర్లపల్లి రాజమల్లారెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీర్లపల్లి రాజమల్లారెడ్డి ప్రతి సంవత్సరం వీర్లపల్లి అంజిరెడ్డి ట్రస్ట్ పేరుతో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన పది మంది విద్యార్థులకు అందజేసే నగదు పురస్కారాన్ని, ప్రశంస పత్రాలను ప్రసాద్ సీడ్ పరిశ్రమ యాజమాన్యంతో కలిసి రూ.లక్షన్నర నగదును విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అమ్మ కమిటీ అధ్యక్షురాలు దుడ్డు మీన, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి గౌస్, తలారి అశోక్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ ఎర్ర సత్యనారాయణ మాజీ ఎంపిటిసి సుంచు సత్యనారాయణ, మాజీ వార్డు సభ్యుడు తాళ్ళ హరిప్రసాద్, తాళ్ళ నర్సింహ, కంబాల మహేష్, ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ్ లతో పాటు లయోలా కళాశాల లెక్చరర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments