గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు

గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు

తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ 11.10.2025 న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక మహిళ, ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై తుర్కయంజాల్ నుండి బయలుదేరి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వస్తుండగా, మార్గమధ్యంలో గుర్రంగూడ వద్ద వెనుక నుండి వేగంగా వస్తున్న థార్ కారు డ్రైవరు అజాగ్రతగా నడపడం వల్ల ఆ బైక్ ను ఢీకొట్టాడు. ఢీకొట్టిన ప్రభావంతో బైక్ సవారీలు రోడ్డుమధ్యలోని డివైడర్‌ను డీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి.గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో సాగర్ కాంప్లెక్స్‌లోని బృంఘి ఆసుపత్రి, లైఫ్ కేర్ హాస్పిటల్, ఓమ్ని హాస్పిటల్‌లకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మాలకపేట్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం
మేడ్చల్ :-సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్- 2025 మేడ్చల్ రెవెన్యూ మండల స్థాయి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడలు మేడ్చల్ రెవెన్యూ మండల కేంద్రంలోని...
ఫైనల్ కు చేరని సిఎంఆర్ ట్రోఫీ
నాగోల్ బండ్లగూడ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమం
మార్కండేయ ఫంక్షన్ హాల్ లో పద్మశాలి ' పోపా ' క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ, పద్మశాలి సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు సన్మానం
బిసి రిజర్వేషన్ లపై ఎల్లంపేట్ మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు
సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం