మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్

ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ : డీసీపీ నంద్యాల కోటిరెడ్డి

మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్

 
300 ఇళ్లను తనిఖీ చేసి 1000 మంది వివరాలు సేకరించిన సైబరాబాద్ పోలీసులు
 
సరైన ధృవపత్రాలు లేని 18 ద్విచక్రవాహనాలు, రెండు కార్లను స్వాధీనం
 
మూడు లిక్కర్ కేసులు, రెండు గంజాయి కేసులు నమోదు
 
188 వాహనాలపై పెండింగ్ లో ఉన్న రూ.91 వేల ట్రాఫిక్ చలాన్ల వసూలు
 
డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 15 వాహనాలు సీజ్
 
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు మేడ్చల్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ అద్దాని సత్యనారాయణ ఆధ్వర్యంలో 176 మంది పోలీస్ సిబ్బందితో గురువారం సాయంత్రం మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని 4వ వార్డులో గల 300 ఇళ్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి 1000 మంది వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 18 ద్విచక్రవాహనాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకుని మూడు లిక్కర్ కేసులు, రెండు గంజాయి కేసులు నమోదు చేయగా 188 వాహనాలపై పెండింగ్ లో ఉన్న రూ.91 వేల ట్రాఫిక్ చలాన్లను వసూలు చేయగా డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 15 వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. స్థానికంగా ఏలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని సూచించారు. నేరాల నివారణ చర్యలలో భాగంగా స్థానిక ప్రాంతాలలో ప్రజలు స్వచ్ఛందంగా కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్‌కు స్పందించవద్దన్నారు. ఎలాంటి అత్యవసర సమయంలో డయల్ 100 నంబర్‌కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 10 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, తెలంగాణ స్టేట్ పోలీస్, ఏఆర్ పోలీస్, ఎస్ఓటి, టాస్క్ ఫోర్స్, ట్రాఫిక్, మహిళా పోలీసులు ఈ కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్నారు.
Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...
నేటి నుంచే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ
కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి