మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు

మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు

మేడ్చల్ :-హైదరాబాద్ లోని రామంతపూర్ లో విద్యుత్ షాక్ తో గత రాత్రి ఆరుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విద్యుత్ షాక్ తో మృతి చెందాడానికి ప్రధాన కారణం కేబుల్ వైర్లే అని విద్యుత్ అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో మేడ్చల్ పట్టణంలోని ప్రధాన రోడ్లు, వీధుల గుండా ఉన్న కేబుల్, ఇంటర్ నెట్ వైర్లను విద్యుత్ అధికారులు సోమవారం తొలగించారు. కాగా విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ కేబుల్, ఇంటర్ నెట్ వైర్లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేబుల్ ఆపరేటర్లు ఉపేందర్,రాఘవేందర్, శ్రీనివాస్, నాయక్, చంద్రశేఖర్, శ్రీనివాస్ తెలిపారు.ఈ చర్యలకు నిరసనగా మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు మేడ్చల్ పట్టణంలో ఇంటర్ నెట్, కేబుల్ టీవీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నామని వారు పేర్కొన్నారు.

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...
నేటి నుంచే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ
కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి