త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు

త్రాగునీరు సమస్యపై మిషన్ భగీరథ అధికారులు. కమిషనర్ చర్యలు తీసుకోవాలి

త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు

ఎల్లంపేట మున్సిపాలిటీ:- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో మంచినీటి సమస్య ఉన్నదని గ్రామస్తులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు ఒకవైపు కుండపోత వర్షాలకు చెరువుల నిండి వాగులు పాడుతుంటే మరోవైపు మంచినీటి ఏదడి ఉండడం సిగ్గుచేటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురపాలక సంఘం పరిధిలోని కొన్ని గ్రామాలలో మంచినీటి పైప్ లైన్ల్ పగిలి నీళ్లు వృధాగా పోతున్న మరికొన్ని గ్రామాలలో త్రాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఎల్లంపేట పురపాలక సంఘం వాసులు తెలిపారు. ఇట్టి విషయంలో మిషన్ భగీరథ అధికారులు. పురపాలక సంఘం కమిషనర్ తగిన చర్యలు తీసుకొని పగిలిన పైపు లైన్లకు మరమ్మతులు చేయిస్తూ త్రాగునీటి సమస్య ఉన్న  గ్రామాలకు నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మిషన్ భగీరథ అధికారులు మంచినీటి సమస్యను పరిష్కరించండి..

ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న మంచినీటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ గ్రామ నివాసులు గత ఆరు నెలలుగా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అని పురపాల సంఘం పరిధిలోని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు కోరుతున్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం 
శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్
కండ్ల కొయ్య ఆక్సిజన్ పార్క్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం