నాన్ ఫెర్రస్ లోహాల పునర్వినియోగ వ్యవస్థ బలోపేతానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
వెబ్‌సైట్, వాటాదారుల పోర్టల్ ప్రారంభం
హైదరాబాద్, మే 7:నాన్ ఫెర్రస్ లోహాల పునర్వినియోగ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా నిలవనున్న వెబ్‌సైట్ మరియు వాటాదారుల పోర్టల్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. https://nfmrecycling.jnarddc.gov.in అనే ఈ పోర్టల్‌ను జాతీయ నాన్ ఫెర్రస్ స్క్రాప్ పునర్వినియోగ మార్గదర్శకాల కింద అభివృద్ధి చేశారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి సతీష్ చంద్ర దూబే, గనుల మంత్రిత్వ శాఖ, జెఎన్ఎఆర్డిడిసికి చెందిన అధికారులు పాల్గొన్నారు. నిర్మాణాత్మక, పారదర్శక, స్థిరమైన రీసైక్లింగ్ వ్యవస్థకు తోడ్పడటమే ఈ ప్లాట్‌ఫాం లక్ష్యంగా పేర్కొన్నారు.ఈ సందర్భంగా జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “వనరులను సమర్థవంతంగా వినియోగించే ఆర్ధిక వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉంది. ఈ పోర్టల్ సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చి, అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునేందుకు భాగస్వాములకు తోడ్పడుతుంది” అన్నారు.సహాయమంత్రి సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ, “పునర్వినియోగ విలువ వ్యవస్థ బలోపేతానికి, పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ పోర్టల్ కీలకం” అన్నారు.ఈ వెబ్‌సైట్ పునర్వినియోగదారులు, తొలగించేవారు, సేకరణదారులు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలతో డేటా, అవగాహన, భాగస్వామ్యాన్ని పెంచే వేదికగా పని చేస్తుంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, స్టేక్‌హోల్డర్ల సమావేశాలు, విధాన పరిణామాలపై నవీకరణలు, గణాంకాలు, ప్రమాణాలను అందుబాటులోకి తీసుకువస్తుంది.పోర్టల్ ద్వారా పరిశ్రమల భాగస్వాముల నమోదు, మౌలిక పదార్థాల వినియోగం, పునర్వినియోగ సామర్థ్యం, సాంకేతిక వినియోగం, కార్మికుల ధోరణులపై డేటా సేకరణ సాధ్యమవుతుంది. ఇవి పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాల పెంపుదలకు ఉపయోగపడతాయి.
-
విడగొట్టే కేంద్రాలు, వ్యాపారులు, సేకరణ కేంద్రాల కోసం జాతీయ రిజిస్ట్రీ
-
సరఫరా, ఉత్పత్తి రకాలూ, సాంకేతిక స్వీకరణ, కార్మిక సంబంధిత డేటా ట్రాక్ చేసేందుకు సాధనాలు
-
పనితీరు సరిపోల్చే బెంచ్‌మార్కింగ్ యంత్రాంగాలు
-
ప్రాంతీయ, రంగాలవారీగా మౌలిక సదుపాయాలు, నైపుణ్య అంతరాల గుర్తింపు
-
ప్రమాణాలు, ధ్రువీకరణ వ్యవస్థలు, అవగాహన కార్యక్రమాల మద్దతు
ఈ చొరవ దేశంలో వనరులను తిరిగి వినియోగించే ఆర్ధిక వ్యవస్థకు, సుస్థిరతకు దోహదపడే దిశగా ఓ కీలక ముందడుగుగా నిలుస్తోంది.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్