శంషాబాద్ లో గులాబీ నేతల అరెస్టు
బీఆర్ఎస్ శంషాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొలను ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర నేత మంచర్ల శ్రీనివాస్ సహా పలువురు గులాబీ నేతల అరెస్టు
అరెస్టు చేసిన నేతలను పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే గులాబీ నేతలు
రాజేంద్రనగర్, మార్చి 30(నగరనిజం ప్రతినిధి):మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ కు చెందిన పలువురు పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ నేతల బృందం సోమవారం నాడు శంషాబాద్ పరిధిలోని కొత్వాల్ గూడ వద్ద రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ మిషన్ ప్లాంట్ ను సందర్శించనున్నారని సమాచారం రావడంతో ఆ పార్టీ నేతల బృందం హుటాహుటిన రాఘవ క్రషర్ ప్లాంట్ కు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు..... ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేశారు. బీఆర్ఎస్పార్టీ రాష్ట్ర నేత మంచర్ల శ్రీనివాస్,బీఆర్ఎస్ పార్టీ శంషాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొలను రెడ్డి, చెక్కల ఎల్లయ్య ముదిరాజ్ (శంషాబాద్ మాజీ ఎంపీపీ), పార్టీ సీనియర్ నేతలు దేవరంపల్లి బుచ్చిరెడ్డి, మాజీ జెడ్పిటిసి బూరు కుంట సతీష్, కొనమొల్ల శ్రీనివాస్, రఘు యాదవ్, చిన్న గండు రాజేందర్, వెంకట్ రెడ్డి, చెక్కల చంద్రశేఖర్ ముదిరాజ్ (పెద్ద షాపూర్ మాజీ సర్పంచ్), వీరమల్లు హనుమంతు ముదిరాజ్, కొమ్ము గోపాల్, మహమ్మద్ గౌస్ పాషా, మంచర్ల చిరంజీవి, బాత్కు మహేష్ యాదవ్, షేక్ మహమూద్, బక్క శ్రీకాంత్ తదితర నేతలు ,కార్యకర్తలు కేటీఆర్ రాకను పురస్కరించుకొని రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ మిషన్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. దీంతో శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ సారధ్యంలో అప్రమత్తమైన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు.... గులాబీ పార్టీ నేతలను అరెస్టు చేసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను దోచుకుంటూ పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ వంటి అక్రమ మైనింగ్ వ్యాపారులను సహించే ప్రసక్తే లేదని, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నేత మంచర్ల శ్రీనివాస్, పార్టీ శంషాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొలను ప్రదీప్ రెడ్డి ప్రకటించారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments