పద్మశాలి టౌన్ షిప్ కాప్రాలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవం

కాప్రా, 16, ఫిబ్రవరి (నగర నిజం) : పద్మశాలి టౌన్షిప్ కాప్రాలో మహాశివరాత్రి వేడుకలు భక్తుల పాల్గొనడంతో అంగరంగ వైభవంగా జరిగాయి. సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగాయి.వేడుకల్లో భాగంగా ముందుగా నక్షత్ర నాట్య నిలయం గురువు అంకం శిరీష శిష్య బృందం ప్రదర్శించిన నాట్య కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రవణానంద భరితంగా సాగిన ఈ నాట్య ప్రదర్శనకు భక్తులు హర్షం వ్యక్తం చేశారు.తదుపరి దీపాలంకరణ కార్యక్రమం పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు దీప అరవింద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పున్నా రమేష్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. శ్రీ శివ మార్కండేయ దేవాలయ ట్రస్ట్ సభ్యులు పున్నానవనీత, బింగి ఉదయశ్రీ, కర్నాటి భాగ్య దొంత మాధవి సహకారంతో దీపాలంకరణను సుందరంగా ఏర్పాటు చేశారు.శివరాత్రి సందర్భంగా పద్మశాలి టౌన్షిప్ శ్రీ శివ మార్కండేయ దేవాలయ భజన బృందం భక్తి పారవశ్యంతో నిర్వహించిన భజనలకు భక్తులు మమేకమై శివనామస్మరణలో లీనమయ్యారు. ఈ కార్యక్రమాలకు పద్మశాలి సంఘం అధ్యక్షుడు నారా జనార్దన్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓవల్దాస్ చక్రపాణి, ఉపాధ్యక్షుడు దొంత శ్రీనివాస్ సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేశారు.అర్ధరాత్రి 11 గంటల 55 నిమిషాలకు ప్రారంభమైన రుద్రాభిషేకం భక్తిపారవశ్యంతో రెండున్నర గంటల పాటు సాగింది. ఈ రుద్రాభిషేకానికి పద్మశాలి టౌన్షిప్ నివాసులతో పాటు సాయి నగర్, దమ్మాయిగూడ, జమ్మిగడ్డ, నాగారం ప్రాంతాల నుంచి భక్తులు హాజరై శివుని దర్శించుకున్నారు. పద్మశాలి టౌన్షిప్ లో నిర్మాణంలో ఉన్న శ్రీ భక్త మార్కండేయ దేవాలయం త్వరలో ప్రతిష్ఠాపన పూర్తిచేసుకుని భక్తులకు అన్ని విధాలుగా అందుబాటులోకి వస్తుందని దేవాలయ ట్రస్ట్ చైర్మన్ సీతా ఆంజనేయులు తెలిపారు. దేవాలయం పూర్తికాకపోయినా గత రెండు సంవత్సరాలుగా నిర్మాణంలోనే వివిధ దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.గత మూడు సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు, దేవి నవరాత్రులు, మార్కండేయ జయంతి సందర్భంగా గాయత్రీ హోమం, జంధ్యధారణ, సీతారామ కళ్యాణాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా హిందూత్వం, సాంప్రదాయం మరింత బలోపేతం అవుతూ భక్తుల మధ్య ఐక్యత పెరుగుతోందని భక్తులు అభిప్రాయపడ్డారు.

16 Feb 2026
మేడ్చల్ మల్కాజ్‌గిరి

www.nagaranijam.com
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

గుర్రంగూడ శివాలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు* గుర్రంగూడ శివాలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు*
మహా శివుడికి పూజలు, అభిషేకం నిర్వహించిన భక్తులు* ఘనంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం* హైదరాబాద్, పిబ్రవరి 16,(నగర నిజం): గ్రేటర్ హైదరాబాద్, గుఱ్ఱంగూడా లోని ఆదిత్య...
వీరన్న గుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పూజలతో భక్తుల సందడి
కుంట్లూరులోని సత్తిరెడ్డి కాలనీ లో ఉన్న విష్ణు పంచాయిత్ హాన సహిత నాగులమ్మ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు
గౌరెల్లి గుట్టపై
పద్మశాలి టౌన్ షిప్ కాప్రాలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవం
శ్రీ మల్లికార్జున స్వామి ఏకవింశతి కళ్యాణ మహోత్సవానికి సన్నాహాలు పూర్తి
మహాశివరాత్రి కి ముస్తాబైన రామలింగేశ్వర స్వామి దేవాలయం