ఘనంగా ప్రాథమిక పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు
విద్యార్థులు ఉపాధ్యాయులు అయిన వేళ
విద్యార్థులు చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి
వనపర్తి జిల్లా: నగర నిజం మార్చి 10 వనపర్తి పట్టణం లో 8వ వార్డు శ్రీనివాసపురం లో మంగళవారం నాడు ప్రాథమిక పాఠశాలలో "విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ” అనే కార్యక్రమంలో ఈ రోజు విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతులను నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈ శాంభవి మాట్లాడుతూ ఈ కార్యక్రమం సాధారణంగా ఈ రోజున కొంతమంది విద్యార్థులను ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి వారికి పాఠాలు బోధించే అవకాశం ఇచ్చాము . వారు బ్లాక్‌బోర్డ్ వద్ద నిలబడి తమ సహ విద్యార్థులకు పాఠాలను వివరంగా చెప్పడం ద్వారా ఉపాధ్యాయుల పాత్రను అనుభవిస్తారు. విద్యార్థులకు ఉపాధ్యాయుల కష్టం, బాధ్యతలు ఎంత గొప్పవో అర్థమవుతుంది. ఒక తరగతిని సక్రమంగా నిర్వహించడం, అందరికీ అర్థమయ్యేలా బోధించడం ఎంత కష్టమో వారు గ్రహిస్తారు. అలాగే విద్యార్థులలో మాట్లాడే నైపుణ్యం, నాయకత్వ గుణాలు, ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతాయి. విద్యార్థులు చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ అనే కార్యక్రమం విద్యార్థులకు మంచి అనుభవాన్ని ఇస్తుంది. ఇది ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని పెంచడమే కాకుండా విద్యార్థులలో బాధ్యతా భావాన్ని పెంపొందిస్తుంది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంఈఓ గుజ్జుల అఖిలేష్, హెడ్మాస్టర్ లక్కీ మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మా ప్రధానోపాధ్యాయురాలికి ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నామన్నారు.16 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థుల బోధనను చూసి సంతోషపడ్డారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్య యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ప్రతి విద్యార్థి దేశానికి, రాష్ట్రానికి పుట్టి పెరిగిన ప్రాంతానికి అమ్మ నాన్నలకు మంచి పేరు తేవాలన్నారు. చదువులో రాణించాలంటే కృషితో, పట్టుదలగా చదవాలన్నారు. విద్యార్థిని, విద్యార్థులు విద్య గొప్పతనం గురించి చెబుతూ, ఈరోజు పిల్లలు ఉపాధ్యాయులు అయినటువంటి వేళ చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు.రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా తయారు చేసి నవ సమాజ నిర్మాణానికి వారిని పంపే గురువు బాధ్యత ఒక ఉపాధ్యాయుని పైనే ఉంటుంది అన్నారు. అలాంటి వృత్తిలో ఉన్నందుకు గర్వపడుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. రాజేశ్వరి, టి. శ్వేత,విద్యార్థినిి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments