మద్యం మత్తులో పోలీసుపై దాడి

మద్యం మత్తులో పోలీసుపై దాడి

వనస్థలిపురం పరిధిలో మద్యం మత్తులో యువకుడు పోలీసుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. 16 ఫిబ్రవరి సాయంత్రం సుమారు 08:15 గంటల సమయంలో వనస్థలిపురంలోని ప్రశాంత్ నగర్‌కు చెందిన దెంది కార్తీక్ రెడ్డి (27) డైమండ్ వైన్స్, పనామా ప్రాంతం వద్ద మద్యం సేవించి ఇతరులతో గొడవపడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించాడు.ఈ విషయమై డయల్ నూరు కు సమాచారం అందడంతో పెట్రోలింగ్ సిబ్బంది అతడిని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన అనంతరం కార్తీక్ రెడ్డి అక్కడ ఉన్న ప్రజలను, డ్యూటీలో ఉన్న సిబ్బందిని దూషిస్తూ అశాంతి సృష్టించాడు.ఈ సమయంలో విధుల్లో ఉన్న యాదగిరి కానిస్టేబుల్ అతడిని ప్రశ్నించగా, కార్తీక్ రెడ్డి అకస్మాత్తుగా తలతో కానిస్టేబుల్ తలపై బలంగా గుద్దాడు. ఈ దాడిలో కానిస్టేబుల్‌కు తలపై తీవ్ర రక్తగాయం అయ్యింది.కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విధుల్లో ఆటంకం కలిగించడం, దాడి చేసిన ఘటనపై కార్తీక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అదనంగా వైన్స్ వద్ద జరిగిన గొడవలో కొట్టిన ఘటనపై కిరణ్ ఫిర్యాదు మేరకు కార్తీక్ రెడ్డి, ఇంకొందరిపై మరో కేసు నమోదు చేశారు.నిందితుడిని రిమాండ్‌కు తరలించగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు చెర్లపల్లి జైలు కు పంపించారు.

18 Feb 2026 12:21 AM
ఎల్ బి నగర్

www.nagaranijam.com 18 Feb 2026 12:21 AM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మద్యం మత్తులో పోలీసుపై దాడి మద్యం మత్తులో పోలీసుపై దాడి
వనస్థలిపురం పరిధిలో మద్యం మత్తులో యువకుడు పోలీసుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. 16 ఫిబ్రవరి సాయంత్రం సుమారు 08:15 గంటల సమయంలో వనస్థలిపురంలోని ప్రశాంత్ నగర్‌కు...
వాసవి క్యాటరర్స్ అండ్ టిఫిన్స్ లో రుచికరమైన అతంటిక్ హోమ్లీ ఫుడ్ 
శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున మరకత లింగ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు  

అక్రమ కేసులకు భయపడేది లేదు: కల్వకుర్తిలో బిఆర్ఎస్ నిరసన
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
గుర్రంగూడ శివాలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు*