మహాశివరాత్రి కి ముస్తాబైన రామలింగేశ్వర స్వామి దేవాలయం
దర్శనానికి విచ్చేసే భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసిన ఆలయ చైర్మన్ ధాత్రిక రాధాకృష్ణమూర్తి
మేడ్చల్ :-మేడ్చల్ పట్టణంలో అతి పురాతనమైన శివాలయం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేసినట్లు ఆలయ చైర్మన్ ధాత్రిక రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ ధాత్రిక రాధాకృష్ణ తెలిపారు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో కృష్ణమాచారి, భక్తులు బాలాజీ, శ్రీనివాసమూర్తి, దాత్రిక లక్ష్మణ్, శ్రీనివాస చారి, కనకాల నర్సింగ్, ఆకాష్, అంకిత్, జలంధర్ రెడ్డి, కార్తీక్, ఆర్యన్, దశరథ్, సంతోష్ చారిలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేస్తున్నారని చైర్మన్ తెలిపారు.
About The Author
Related Posts
Post Your Comment


Comments