తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం
ఎల్బీనగర్, మార్చి 29, (నగర నిజం) : నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్ పరిధిలోని బి.ఎన్.రెడ్డి డివిజన్ గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మల్కాజిగిరి అడ హక్ కమిటీ సభ్యుడు గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న సుమారు 100 మంది రోగులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు ఆత్మీయంగా పరామర్శలు తెలియజేశారు.ఈ సందర్భంగా గద్దె విజయ్ నేత మాట్లాడుతూ, 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సేవను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్టీఆర్ అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేశారని పేర్కొన్నారు. పేదల కోసం రూ.2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, మహిళల సాధికారత కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి చర్యలు ఆయన పాలనలో చేపట్టిన ముఖ్య కార్యక్రమాలన్నారు.ఎన్టీఆర్ నాయకత్వం వల్లే తెలుగు ప్రజల్లో ఆత్మగౌరవ భావన పెరిగిందని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీ నేటికీ ప్రజల కోసం పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి, అంజనేయులు, పుల్లారెడ్డి, నరేష్ చౌదరి, శేఖర్, చోటు వెంకట్, కిరణ్, ప్రవీణ్, మల్లేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments