సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి
ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉదావత్ లచ్చిరాం పిలుపు
బంజరాల ఆరాధ్య దైవం సామాజిక సంస్కర్త సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 287 జయంతి ఉత్సవాలను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని ట్రైబల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ మునగనూరు తొర్రూర్ ఉపాధ్యక్షులు ఉదావత్ లచ్చిరాం, సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ధరావత్ జవహర్లాల్, వడిత్య దాసు నాయక్, రమావత్ చరణ్ నాయక్, వాంకుడోత్ రాజు నాయక్,జేవేందర్ నాయక్ తదితరులు కోరారు. వారు ఉదయం మునగనూరులో వాకింగ్ సమయములో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రేపు ఫిబ్రవరి 15 సేవాలాల్ మహారాజ్ గారి జయంతి రోజు కాబట్టి బంజారాల ప్రతి ఇంటా,నోటా సేవాలాల్ మహారాజ్ గారి మాట, పాట ఉండాలని సూచించారు. సేవాలాల్ మహారాజ్ గారు లేకపోతే ఈ జాతికి ఇంత జాగృతం వచ్చేది కాదన్నారు.బంజరా జాతి కొరకు ఎవరైతే శ్రమించారో, వారి శ్రమను గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని, ప్రతి బంజారా సోదరులు తమ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలని, ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి సేవాలాల్ మహారాజ్ గారి జయంతి రోజున జాతీయ సెలవు దినం ప్రకటించాలని కోరారు.
About The Author
Related Posts
Post Your Comment


Comments