వీరన్న గుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పూజలతో భక్తుల సందడి

హయత్ నగర్, 16, ఫిబ్రవరి (నగర నిజం) : హయత్ నగర్ మనసురాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్న గుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పూజలు భక్తుల రద్దీతో కిక్రిసిపోయాయి. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, రుద్రాభిషేకాలు, దీపారాధనలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.ఉపవాస దీక్షతో వచ్చిన భక్తులు పూజల అనంతరం దీక్షను విరమించుకున్నారు. రాత్రి వరకు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. శివనామస్మరణతో పాటు జాగరణ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తాగునీరు, ప్రసాద వితరణ, శాంతి భద్రతల ఏర్పాట్లు సమర్థంగా నిర్వహించామని పేర్కొన్నారు. భక్తుల సహకారంతో కార్యక్రమాలు విజయవంతంగా సాగినట్లు తెలిపారు.

16 Feb 2026 11:36 PM
ఎల్ బి నగర్

www.nagaranijam.com 16 Feb 2026 11:36 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News