గౌరెల్లి గుట్టపై

శ్రీ స్వయంభు స్వర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి శివాలయంలో శివపార్వతి కళ్యాణ మహోత్సవము

గౌరెల్లి గుట్టపై

అబ్దుల్లాపూర్ మెట్, 16, ఫిబ్రవరి (నగర నిజం) : అబ్దుల్లాపూర్ మెట్ మండలం గౌరెల్లి గ్రామం గౌరెల్లి గుట్టపై ఉన్న శ్రీ స్వయంభు స్వర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి శివాలయంలో శివపార్వతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి చేరుకుని అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటలకు శివపార్వతి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాగోల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ పెద్దలు హాజరయ్యారు. మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తుల సౌకర్యార్థం కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ నెల్లూరు రాజు, వైస్ చైర్మన్ చంచల శ్రీనివాసు, డైరెక్టర్లు గ్యార దివ్య దాసు, నీరుడు రాజు, చెట్టిగారి రాజు గౌడ్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తుల సహకారంతో కార్యక్రమాలు సజావుగా కొనసాగినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.

IMG-20260215-WA0227IMG-20260215-WA0236

16 Feb 2026 11:14 PM
ఇబ్రహీంపట్నం

www.nagaranijam.com 16 Feb 2026 11:14 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News