శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున మరకత లింగ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు

నాగోల్ పరిధి మమత నగర్ బసవేశ్వర కాలనీలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున మరకత లింగస్వామి ఆలయంలో శ్రీశైల మల్లికార్జున సమాజోత్తన ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో వేడుకగా జరిగాయి. భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి విచ్చేసి ఆలయాన్ని దర్శించుకున్నారు. వీధి దీపోత్సవ అలంకరణతో ఆ ప్రాంతమంతా శివ నామస్మరణతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉదయం నుండి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, సాయంత్రం పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, పండ్ల వితరణ, రాత్రి భజన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించామని అన్నారు. కాశిలో మాదిరిగా మా ఆలయం ఉంటుందని ఇలాంటి రాతి మరకత లింగం ఆలయం ఈ చుట్టుపక్కల పాపంలో ఎక్కడ లేదని ఎంతో మహిమగల ఆలయమని కావున భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి విశేషంగా వస్తారని అన్నారు. ఆలయ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్న ఆలయ పెద్దలు వాలి బసవరాజ్ గారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షలు వీర మల్లేశం, జగదేవ్ వీరమట్, వాలి బస్వరాజ్, కర్ణాకర్, వి. నాగ భూషణం, మహిళ అధ్యక్షురాలు రుద్రమదేవి, అన్నపూర్ణ, దేవాలయ సేవ దళ్ సభ్యులు శివ శంకర్, సాయి ప్రసాద్, శెట్టి మహేష్ , ప్రదీప్, రామేష్ , విజయ్, శ్రీనివాస్, కిరణ్, చారి, రవి, యువకులు, పూజారి మల్లి కార్జున్ బృందం పాల్గొని ఈ శివరాత్రి వేడుకలను విజయవంతం చేశారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments