మెడిసిటీ ఇన్స్టిట్యూట్‌లో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం

మేడ్చల్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.వెంకట్ రెడ్డి

మేడ్చల్ మార్చి 16(నగరనిజం)ఏల్లంపేట్ పురపాలక సంఘం పరిధిలోని ఘనపూర్ గ్రామంలో గల మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ సంస్థలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు రోడ్డు భద్రతపై సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడిమెట్ల ట్రాఫిక్ ఏసీపీ కె. వెంకట్ రెడ్డి, మేడ్చల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో పాటు మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ డా. దేవేంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రహదారి నియమాలను ఖచ్చితంగా పాటించినప్పుడే ప్రమాదాలను నివారించగలమని ఆయన అన్నారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించడం ఎంతో అవసరమని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ ఉపయోగించడం వల్ల జరిగే ప్రమాదాల గురించి కూడా వివరించారు. చిన్నపిల్లలు రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఇందుకు సంబంధించిన లఘు చిత్రాలను ప్రదర్శిస్తూ ప్రమాదాలు ఎలా జరుగుతాయో విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా అధిక వేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలను చిత్రాల ద్వారా చూపించారు. ఈ కార్యక్రమంలో మెడిసిటీ ఇన్స్టిట్యూట్‌కు చెందిన అధ్యాపకులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, విద్యార్థినులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

17 Mar 2026 08:03 AM

www.nagaranijam.com 17 Mar 2026 08:03 AM
Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

క్యూలినారీ ఒలంపియాడ్ అంతర్జాతీయ  పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన చెఫ్ ముక్కెర దివ్య క్యూలినారీ ఒలంపియాడ్ అంతర్జాతీయ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన చెఫ్ ముక్కెర దివ్య
మేడ్చల్ :-ప్రపంచ చెఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “క్యులినరీ ఒలింపియాడ్ అంతర్జాతీయ పోటీలు” మార్చి 10 నుంచి మార్చి 14 వరకు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ...
మెడిసిటీ ఇన్స్టిట్యూట్‌లో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
అధికారుల నిర్లక్ష్యం… స్థంబాలు ఎక్కిన కౌన్సిలర్లు!
కురుమ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కురుమ యువ చైతన్య సమితి చర్చ
ఘనంగా ప్రాథమిక పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు
గ్రామాభివృద్ధే లక్ష్యం
మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్