మహిళలు వస్త్ర రంగంలో రాణిస్తారు: మర్రి శశిధర్ రెడ్డి

నాగోల్, 21 మార్చి (నగర నిజం) :మహిళలకు వస్త్ర రంగంపై పూర్తి అవగాహన ఉండటంతో వారు ఈ రంగంలో ఖచ్చితంగా రాణిస్తారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్‌లో స్వాతి రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన తన్వీర షాపింగ్ మాల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడటానికి వస్త్ర రంగం మంచి అవకాశాలను అందిస్తుందని చెప్పారు. కృషి, పట్టుదల ఉంటే ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని పేర్కొన్నారు.స్థానికంగా ఇలాంటి వ్యాపార సంస్థలు ఏర్పడటం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అన్నారు. షాపింగ్ మాల్ నిర్వహణలో నాణ్యతతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి జాగృతి మహిళ అధ్యక్షురాలు నూకల పద్మా రెడ్డి, పావని రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.

21 Mar 2026 01:45 PM
ఎల్ బి నగర్

www.nagaranijam.com 21 Mar 2026 01:45 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

జనాభా లెక్కల్లో గందరగోళం – కురుమల ఆవేదన జనాభా లెక్కల్లో గందరగోళం – కురుమల ఆవేదన
ఎల్బీనగర్, ఏప్రిల్ 29 (నగర నిజం): ఇటీవల నిర్వహించిన కుల సర్వేలో కురుమల జనాభా గణనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర...
అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం
పచ్చని భూములు పిచ్‌లుగా… అధికారుల మౌనం వెనుక రహస్యం!
హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు
మహేశ్వరం రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
అడ్వకేట్‌పై పోలీస్ ప్రవర్తనపై ఆగ్రహం
ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు