బీసీలకు న్యాయం చేయాలి – ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష
బిసి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గద్దె విజయ్ నేత సంఘీభావం
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (నగర నిజం) : బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఇకపై సహించబోమని స్పష్టం చేస్తూ హైదరాబాద్‌లోని ధర్నా చౌక్, ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు నేతృత్వంలో ఏర్పాటు చేశారు.బీసీలకు సముచిత ప్రాతినిధ్యం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విధానాల్లో సమాన భాగస్వామ్యం కల్పించాలని దీక్షలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రత్యేక చర్యలు అవసరమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి బిసి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గద్దె విజయ్ నేత సంఘీభావం తెలిపారు. టి. చిరంజీవులకు గద్దె విజయ్ నేత శాలువా కప్పి సన్మానించారు. బీసీల హక్కుల కోసం జరుగుతున్న ప్రతి పోరాటానికి తాము అండగా ఉంటామని ఆయన వెల్లడించారు.ఈ నిరాహార దీక్షలో బిసి సంఘం నాయకులు గుజ్జ సత్యం, దుర్గయ్య గౌడ్, బీసీ చెన్న శ్రీకాంత్, జాతీయ చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు వెంకన్న నేత పాల్గొన్నారు. ఇతర బీసీ నాయకులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments