రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

కాలనీ అభివృద్ధికి కృషి చేస్తాము: అధ్యక్షుడు ఉబ్బ సురేష్, ప్రధాన కార్యదర్శి కందిబండ శంకర్

కాలనీ వాసులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కమిటీ సభ్యులు

కుంట్లూరు, 3,మార్చి (నగర నిజం) : కుంట్లూర్ డివిజన్ పరిధిలోని రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు, కాలనీవాసులు మంగళవారం మీడియాకు తెలిపారు. కాలనీ అభివృద్ధి లక్ష్యంగా అందరి సమన్వయంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.అనంతరం మీడియాతో అధ్యక్షుడు ఉబ్బ సురేష్ మాట్లాడుతూ... కాలనీవాసులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కాలనీని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని వెల్లడించారు. మౌలిక వసతుల మెరుగుదల, పారిశుధ్యం, వీధి దీపాలు, సీసీ రోడ్లు,తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.
నూతన కార్యవర్గ సభ్యులుగా అధ్యక్షుడు ఉబ్బ సురేష్, ప్రధాన కార్యదర్శి కందిబండ శంకర్, ట్రెజరర్ మంత్రి ప్రభువు, ఉపాధ్యక్షులు కే. రామలింగారెడ్డి, పి.జంగారెడ్డి, సంయుక్త కార్యదర్శులు టి.రవీందర్ రెడ్డి, వి. శివకుమార్, కే.ఓం ప్రకాష్, వ్యవస్థాపక కార్యదర్శులు వి. అంజన్ కుమార్, పి. కిరణ్ కుమార్, కే.నరసింహ, సాంస్కృతిక కార్యదర్శులు పి. రాజశేఖర్, ఎస్.పురుషోత్తం, ఎం.వంశీ, సలహాదారులు ఎం. అశోక్, ఎం.శ్రీనివాస్, జె. ప్రసాద్, జి.రామలింగయ్య, కార్యనిర్వాహక సభ్యులు టి. ఉపేందర్, ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఎండి.ఖదీర్, జి.శ్రీనివాస్, జి. అజయ్ కుమార్, కే.శ్రీనివాస్, ఎన్.నరేందర్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని నూతన కమిటీ పిలుపునిచ్చింది.

InShot_20260303_140235687

03 Mar 2026 02:02 PM
రంగారెడ్డి ఇబ్రహీంపట్నం

www.nagaranijam.com 03 Mar 2026 02:02 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News