గుర్రంగూడ శివాలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు*

IMG-20260216-WA0180మహా శివుడికి పూజలు, అభిషేకం నిర్వహించిన భక్తులు* ఘనంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం*

హైదరాబాద్, పిబ్రవరి 16,(నగర నిజం): గ్రేటర్ హైదరాబాద్, గుఱ్ఱంగూడా లోని ఆదిత్య నగర్ లో వెలసిన శివాలయంలో మహా శివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా ఘనంగా జరిగాయి. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమెతంగా ఆలయానికి విచ్చేసి మహా శివుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆ పరిసర ప్రాంతమంతా మారుమొగాయి. శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీ అభినవ్వొదండ శ్రీ విద్యా శంకర భారతీ మహా స్వామి వారి మంగళాశాసనములతో పుష్పగిరి పీఠఅనుబంధ దేవాలయాల ధర్మాధికారి ఎం ఎల్ అర్ గుప్త ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి మహాశివ లింగంకు విశేష పూజలు రుద్రాభిషేకాలు జరిగాయి.రాత్రి 10 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం, తదుపరి రాత్రి 12 గంటలకు లింగోద్బావ సమయంలో మహాశివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా, అతి వైభవంగా నిర్వహించారు. మహిళల సౌభాగ్యం కొరకు, వివాహ ప్రాప్తి, సంతన ప్రాప్తి, ఇతరత్రా గ్రహచార దోష సమస్యలు ఉన్నవారు ఆలయాన్ని సందర్శించి పార్వతి పరమేశ్వరుల కల్యాణ మహోత్సవంలో పాల్గొని వారి సమస్యలు నెరవాలని వేడుకున్నారు. ఈ ఆలయం ఎంతో మహిమగల ఆలయం అని, భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అని, భక్తుల ధర్మబద్ధమైన కోరికలను అష్ట, ఐశ్వర్య ప్రదాత, సృష్టి స్థితి లయకారకుడు అయిన మహా శివుడు వెంటనే నెరవేరుస్తారని ఎం ఎల్ అర్ గుప్తా తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలతో తుల తూగాలని ఆ సదాశివుడి కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి దాతలు ఎంతగానో సహకరించారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చక స్వాములు కే ఎల్ కిషోర్, ముదిగొండ సత్యనారాయణ, సాయి ఈశ్వర్, కళ్యాణం కర్త శ్రీనివాస్ ,ఆలయ ప్రతినిధులు విశ్రాంత ఎస్పీ పోలా విజయ కుమార్, కాలంచ రమేష్ ,ఈఓ నల్ల రవి, తహశీల్దార్ పాండు, సుంకరి శ్రీనివాస్ , శివ, కొత్త ప్రదీప్ ,పుచ్చకాయల జగదీశ్వర్ రెడ్డి,పున్నా హరి ,గోవర్ధనగిరి రవి,అడపా గంగాధర్ ,మురళీధర్ రెడ్డి,శివ శంకర్,తదితరులు పాల్గొన్నారు .ఉదయం నుండి రాత్రి 3 గంటల వరకు విరామం లేకుండా ఏ ఫలితం ఆశించకుండా సేవ చేసిన సేవా బృందానికి ఎం ఎల్ అర్ గుప్త కృతజ్ఞతలు తెలియజేశారు.

IMG-20260216-WA0183IMG-20260216-WA0182IMG-20260216-WA0181

16 Feb 2026 11:41 PM

www.nagaranijam.com 16 Feb 2026 11:41 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News