ఆర్కేపురంలో రజక సంఘం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
ఆర్కే పురం, 23, ఫిబ్రవరి (నగర నిజం) : నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గట్టు జాతరలో జరిగిన విషాద సంఘటనను ఖండిస్తూ ఆర్కే పురం రజక సంఘం ఆధ్వర్యంలో తీవ్ర నిరసన కార్యక్రమం నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై దిష్టిబొమ్మ దహనం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రజక సంఘం నేతలు మాట్లాడుతూ కుమ్మెర గట్టు జాతరలో మల్లన్న దేవుని దర్శనానికి వెళ్తున్న రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబాన్ని కొందరు అడ్డుకున్నారని తెలిపారు. చిన్నారిని కూడా చూడకుండా జరిగిన దాడిలో పసిపాప ప్రాణాలు కోల్పోయిన ఘటన అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలతో డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.పసిపాప మృతికి కారణమైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని రజక సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్కే పురం రజక సంఘానికి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments