కుంట్లూరులోని సత్తిరెడ్డి కాలనీ లో ఉన్న విష్ణు పంచాయిత్ హాన సహిత నాగులమ్మ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు
కుంట్లూరు, 16, ఫిబ్రవరి (నగర నిజం) : కుంట్లూరులోని సత్తిరెడ్డి కాలనీ లో ఉన్న విష్ణు పంచాయిత్ హాన సహిత నాగులమ్మ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దేవాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉపవాస దీక్షలో పాల్గొన్న భక్తులు శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకాలు, బిల్వార్చన, దీపారాధన వంటి కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు సీతారామచంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, నాగులమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర స్వాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శివనామస్మరణతో దేవాలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గతంలో దేవాలయం దీనావస్థలో ఉండగా కాలనీ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు కలిసి పునరుద్ధరణ పనులు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం భక్తుల సహకారంతో దేవాలయం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. దేవాలయ అభివృద్ధికి సహకరించదలచిన దాతలు 9396276181 నంబర్‌ను సంప్రదించాలని కమిటీ సభ్యులు కోరారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Post Your Comment

Comments