అధికారుల నిర్లక్ష్యం… స్థంబాలు ఎక్కిన కౌన్సిలర్లు!

వార్డ్ ఆఫీసర్ రమణరెడ్డి నిర్లక్ష్యమే కారణం ఉంటున్న గ్రామస్తులు

ఎల్లంపేట్, మార్చి 13:-ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో జరుగుతున్న రంగనాయక స్వామి, భవాని రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. జాతర నేపథ్యంలో గ్రామంలో వీధి లైట్ల సమస్య తలెత్తినప్పటికీ పలుమార్లు సమాచారం అందించినా అధికారులు స్పందించకపోవడంతో స్థానిక 17వ, కౌన్సిలర్ స్వయంగా విద్యుత్ స్థంబాలు ఎక్కి లైట్లు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

జాతరకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో రాత్రి సమయంలో చీకటి కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యపై అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కౌన్సిలర్లు స్వయంగా ముందుకు వచ్చి లైట్లు అమర్చినట్లు తెలిపారు.

అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వార్డు ఆఫీసర్ రమణ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ అబ్దుల్ సాలాం తీరుపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతర వంటి ముఖ్యమైన వేడుకలో కూడా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు.

ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

13 Mar 2026 12:02 PM
మేడ్చల్ మల్కాజ్‌గిరి

www.nagaranijam.com 13 Mar 2026 12:02 PM
Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం
ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎల్లంపేట్ గ్రామంలో ఆడబిడ్డ వివాహం సందర్భంగా సేవాభావాన్ని చాటే కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన రాగం పద్మ శ్రీనివాస్ కుమార్తె వివాహం సందర్భంగా 24వ...
పచ్చని భూములు పిచ్‌లుగా… అధికారుల మౌనం వెనుక రహస్యం!
హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు
మహేశ్వరం రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
అడ్వకేట్‌పై పోలీస్ ప్రవర్తనపై ఆగ్రహం
ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
మదనాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ సమావేశం