ఆర్టీసి కాలనీలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
ముఖ్య అతిథులు: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హయత్నగర్ డివిజన్ అధ్యక్షులు చెన్నగౌని శ్రీధర్ గౌడ్
హయత్ నగర్, మార్చి 28 (నగర నిజం) హయత్ నగర్ ఆర్టిసి కాలనీలో శ్రీ శ్రీ శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్దల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షులు చెన్నగౌని శ్రీధర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసి, అందరికీ శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. వేడుకలు భక్తి వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments