హయత్ నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ వేడుకలు

హయత్ నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ వేడుకలు

IMG-20260318-WA0169InShot_20260319_123501153హయత్ నగర్, 19, మార్చి (నగర నిజం) : హయత్ నగర్ మునగనూరు రోడ్‌లోని వక్ఫ్ బోర్డు ప్రాంగణంలో మజిదే బిలాల్ మజీద్ ఆధ్వర్యంలో మహమ్మద్ సల్మాన్ షమ్ము నేతృత్వంలో ఇఫ్తార్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర రమజాన్ నెల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.ఈ సందర్భంగా టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఉపవాసం ఆత్మశుద్ధికి, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో సౌహార్ద వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి ఇఫ్తార్ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.హయత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నగొని రవీందర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రమజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని మతాల ప్రజలు కలసి జరుపుకునే ఈ వేడుకలు సామరస్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముస్లిం యువకులు, కుల, మత పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపవాస విరమణ చేశారు. ప్రార్థనల అనంతరం అందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ వేడుకలు స్థానిక ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలపరిచాయి.

19 Mar 2026 12:35 PM
ఎల్ బి నగర్

www.nagaranijam.com 19 Mar 2026 12:35 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

హయత్ నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ వేడుకలు హయత్ నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ వేడుకలు
హయత్ నగర్, 19, మార్చి (నగర నిజం) : హయత్ నగర్ మునగనూరు రోడ్‌లోని వక్ఫ్ బోర్డు ప్రాంగణంలో మజిదే బిలాల్ మజీద్ ఆధ్వర్యంలో మహమ్మద్ సల్మాన్...
సికింద్రాబాద్ వీధుల్లో 'సురక్షితాహారం' విప్లవం
ఉమ్మడి మేడ్చల్ నాయకుల నుంచి దేవేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు
క్యూలినారీ ఒలంపియాడ్ అంతర్జాతీయ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన చెఫ్ ముక్కెర దివ్య
మెడిసిటీ ఇన్స్టిట్యూట్‌లో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
అధికారుల నిర్లక్ష్యం… స్థంబాలు ఎక్కిన కౌన్సిలర్లు!
కురుమ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కురుమ యువ చైతన్య సమితి చర్చ