శ్రీ మల్లికార్జున స్వామి ఏకవింశతి కళ్యాణ మహోత్సవానికి సన్నాహాలు పూర్తి
అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఏకవింశతి 21వ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు వెల్లడించారు.ఈ నెల 16వ తేదీ సోమవారం ఉదయం 5.30 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం, ఉదయం 8 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమాల వివరాలను ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపగోని రాజు యాదవ్ వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు ఏర్ల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నార్లకొండ దేవేందర్ యాదవ్, కార్యదర్శి గాద్దుల సాయి యాదవ్, కోశాధికారి నార్లకొండ శ్రీకాంత్ యాదవ్, సలహాదారుడు గోపగోని నరేష్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే కమిటీ సభ్యులు ఎండి హైదర్, కుమ్మరిశెట్టి శ్రీకాంత్, పగడాల ప్రవీణ్, కొత్త వెంకటేష్ యాదవ్, మల్లికార్జున స్వామి దేవాలయ ఫౌండర్ నోముల జగదీశ్వర్, ఆలయ పూజారి పెద్ద నరహరి శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Your Comment


Comments